సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth)నటిస్తున్న ’కూలీ’ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సియు)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో ఇటీవల కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గురువారం మేకర్స్ అమీర్‌ఖాన్‌ని దహాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్ (Intense look)లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డి.సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.