గ్యారంటీల అమలులో
విఫలం బిసిలకు తీవ్ర
అన్యాయం ఎస్‌సి,
ఎస్‌టిలకు సంకెళ్లు భీం
పేరుతో డ్రామా బిజెపి
తెలంగాణ అధ్యక్షుడు
రాంచందర్‌రావు ఆగ్రహం
నేడు పదవీ స్వీకారం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ అక్షయ పాత్రగా మారిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోందని, ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ సందర్భంగా రామచంద్రరావు స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 6 గ్యారంటీలు, 13 హామీలు అంటూ భారీగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ
హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని అన్నారు. కుల గణన పేరిట బీసీలకు అన్యాయం చేసి, ముస్లింలను బీసీ కోటా లో చేర్చడమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ సభ నిర్వహించేది సామాజిక న్యాయం కోసం కాదు, సామాజిక న్యాయానికి తూట్లు పొడవడానికేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరని అన్నారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయని విషయాన్ని మరిచినట్టుగా మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చారని అన్నారు. కానీ ప్రజల మనసులో ఉన్న అసలైన ప్రశ్న ఒక్కటే ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహించిందని ప్రశ్నించారు.
అది సామాజిక అన్యాయ భేరి: బండి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహిం చిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఛలోక్తులు విసిరారు. ఈ సభ పేరును ’సామాజిక న్యాయ భేరి’ అని కాకుండా ’సామాజిక అన్యాయ భేరి’ అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోయేది అని ఆయ న ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల వారిని ఎన్నడూ ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రిగా చేయలేద ని విమర్శించారు.
బీసీలకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు
ఇచ్చిందో చెప్పాలి: ఎమ్మెల్యే పాయల్
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని పదవులు ఇచ్చిం దో బహిరంగంగా చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎన్నటికీ చేయలేదని ఆయన విమర్శించారు.