Sunday, July 6, 2025

బాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం : పేర్నినాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేతలు ప్రతి రోజూ వైఎస్ఆర్ సిపి నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారని ఎపి మాజీ మంత్రి పేర్నినాని (perni nani) తెలిపారు. ప్రతిరోజూ ఆడపిల్లలు బలి అవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపిలో నరకాసుర పాలన జరుగుతోందని, మనుషుల రూపంలో ఉన్న సైకోల పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో హత్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో ఏహ్యాభావం ఏర్పడిందని చెప్పారు. వైయస్ఆర్ సిపి వాళ్లకు పనులు చేయొద్దని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు.

పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించారు. చంద్రబాబుతో సహా టిడిపి నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని దాడులు చేయమని, భయపెట్టమని, ఊళ్లోంచి తరిమేయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి మాజీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి మంచి పేరుందని, నాగమల్లేశ్వరరావు కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని తెలియజేశారు. టిడిపి నేతల దోపిడిని (TDP leaders) అడ్డుకోవడమే నాగమల్లేశ్వరరావు చేసిన నేరమా? అని వైసిపి మాజీ ఎమ్మెల్యే బాబురావు మీద దాడి చేసి కొడుతుంటే అడ్డుపడింది నాగమల్లేశ్వరరావు కాదా? అని పేర్ని నాని
నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News