Sunday, July 6, 2025

వార ఫలాలు (06-07-2025 నుండి 12-07-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. చేసే పనిలో కష్టం తప్ప ఫలితం దక్కదు. సంతానపరమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి  స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి అలాగే దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ వారం శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనయోగం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రీన్.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తుల విషయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన భూమిని ఎవరైనా కబ్జా చేయవచ్చు లేదా డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల మోసపోయే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగినది. వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడతాయి. ప్రతి చిన్న విషయానికి చికాకు పడతారు, మనోవేదనకు గురవుతారు. చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి ఆదరణ బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా. కష్టానికి తగిన ప్రతిఫలం కొంత వరకు ఈ వారం మీకు దక్కుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలసి వచ్చే రంగు లైట్ ఎల్లో.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం మారకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగండి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో రాణిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనువైన కాలం కాదు. మంచి అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. విద్యార్థిని విద్యార్థులకు కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రతి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఈ వారం తొలగి పోతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం బాగుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ పరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గతవారం కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా గణపతి స్తోత్రాన్ని పఠించండి. జిల్లేడు వత్తులతో గణపతికి దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రయ విక్రయాలలో నష్టాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. వ్యాపారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వృధా  ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నష్టం వాటిల్లుతుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరలతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అమ్మవారికి కుంకుమార్చన లేదా చండీ హోమం చేయించండి దీని వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన విద్యా విషయాలు పై దృష్టి సారిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్యా రాశి వారికి  ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాలపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి పౌల్ట్రీరంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు బాగుంటాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మరియు మెడలో కాలభైరవ రూపు ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్.

తుల:  తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య వరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైజాగ్ లో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు లైసెన్సులు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విదేశీ విద్య అనుకూలిస్తుంది. వీసా లభిస్తుంది. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని అష్టోత్తరంతో పూజించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ  వారం మద్యస్థ ఫలితాలు ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్మోటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు కొంతకాలం వేచి ఉండి ప్రారంభించండి. ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మెడలో దక్షిణామూర్తి రూపును ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలను చక్కగా రాణించగలుగుతారు. మీరు ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్న ఒక ప్రాజెక్టు ఈ వారం మీ చేతికి అందుతుంది. ఉద్యోగ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు కొంతకాలం వేచి ఉండి ప్రయత్నం చేయండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా బాగున్నాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయి. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చెడు అలవాట్లకి బానిస కాకుండా చూసుకోవాలి. స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే.

మకరం:   మకర రాశి వారికి ఈ  వారం  అంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. అనుకోని సంగతులు జరిగే అవకాశం లేకపోలేదు. మీరు అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్టుగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ వివాదాలు తీరుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు బ్లూ. ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. సౌర కంకణం చేతికి ధరించండి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తగిన నిద్ర ఆహారం ముఖ్యమని గ్రహిస్తారు. కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం పాటించడమే మంచిది. నలుగురితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం  అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీకున్న తెలివితేటలతో అందరిని మెప్పించగలుగుతారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా పనిలో ప్రయత్నం లోపం లేకుండా చూసుకుంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఇష్టపడతారు. సంఘంలో మీ స్థాయి పరపతి పెరుగుతుంది. ధనం ఎలా సంపాదించాలి అనే అంశం పైన ఎక్కువగా దృష్టిని పెడతారు. ధనం ఉంటేనే సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని నమ్ముతారు. ఋణాలు చాలా వరకు తీరుస్తారు. విదేశాలకు వెళ్లడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఉద్యోగంలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో  దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News