Sunday, July 6, 2025

అనుష్క ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ.. ‘ఘాటి’ విడుదల వాయిదా..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్వీటి అనుష్క శెట్టిని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అయింది. 2023లో వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ఆమె చివరిసారిగా ఫ్యాన్స్‌ను పలకరించారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘ఘాటి’ (Ghaati). క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మరో వారం రోజుల్లో చిత్రం రిలీజ్ అవుతుంది అనగా.. చిత్ర యూనిట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

‘‘సినిమా అనేది ఒక జీవనది.. అది ప్రవహిస్తుంటుంది. ‘ఘాటి’ (Ghaati) కేవలం సినిమా మాత్రమే కాదు. ఒక ప్రతిధ్వని.. ఒక అడవి గాలి. మట్టి నుంచి పట్టిన కథ ఇది. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం మీకు అద్భుతంగా చూపించాలనే ఉద్ధేశ్యంతో సినిమాను తీర్చిదిద్దుతున్నాం. ఈ ఎదురుచూపు విలువైనది. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రయాణంలో మాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మళ్లీ త్వరలోనే కలుస్తాం’’ అని ఘాటి టీమ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

యువి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాట ప్రేక్షకులను అలరించాయి. విఎఫ్ఎక్స్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News