Monday, July 7, 2025

అధిక వడ్డీ ఆశ చూపి రూ.4,215కోట్లు వసూలు.. ఫాల్కన్ సిఇఒ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసిన కేసులో ఫాల్కన్ గ్రూప్ సిఇఒ ఆర్యన్‌సింగ్‌ను ఎట్టకేలకు పంజాబ్‌లోని బత్తిండాలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో నిందితులు ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ ను అభివృద్ధి చేయడం ద్వారా డిపాజిటర్లను మోసం చేశారు. ప్రసిద్ధ ఎంఎన్‌సిల పేరుతో నకిలీ ఒప్పందాలను సృష్టించారు, స్వల్పకాలిక ప్రణాళికలతో అధిక వడ్డీ రేట్ల నెపంతో డిపాజిటర్లను ప్రలోభపెట్టారు 7056 మంది డిపాజిటర్ల నుండి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారు. అందులో 4065 మంది బాధితులు రూ.792 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ మోసం, కుట్రపూరిత కేసును సిఐడికి బదిలీ చేశారు. భారతదేశం అంతటా నిందితుడైన కంపెనీ, దాని డైరెక్టర్లపై 8 కేసులు నమో య్యాయి.

ప్రధాన నిందితుడు ఆర్యన్ సింగ్ కంపెనీ ఎండి అమర్ దీప్‌కుమార్, ఇతర నిందితులతో డిపాజిటర్లను ఆకర్షించడానికి చురుకుగా పాల్గొన్నాడు కంపెనీ తరపున బాధితుల నుండి రూ.14,35,00,000/- వరకు వ్యూహాత్మక డిపాజిట్లను సేకరించాడు. ఫాల్కన్ నిధుల నుండి రూ.1,62,55,619/- మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించాడు. అనంతరం అతను నాందేడ్‌కు పారిపోయి అక్కడి నుండి పంజాబ్‌లోని బతిండాకు వెళ్లి గురుద్వారాలో ఆశ్రయం పొందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణాలోని సిఐడి ప్రత్యేక బృందం పంజాబ్‌లోని బతిండాకు వెళ్లి అతన్ని అరెస్టు చేసింది. పోలీసులు అతని వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు,నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆర్యన్ సింగ్‌తో పాటు, 9 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితులందరినీ చేస్తామని తెలంగాణ సిఐడి పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News