Thursday, July 10, 2025

ఏనుగు దాడిలో అరుణాచల్ మాజీ ఎంఎల్ఎ మృతి

- Advertisement -
- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్‌ఎల్‌ఏ కప్చెన్ రాజ్‌కుమార్ (65) బుధవారం ఉదయం ఏనుగు దాడిలో మృతి చెందారు. ఆయన స్వగ్రామం నమ్సంగ్ నుంచి డియోమలి పట్టణానికి నడిచి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. రాజ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి పెమాఖాండు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రాజ్‌కుమార్ 1985 నుంచి 1990 వరకు ఎమ్‌ఎల్‌ఏ గా పనిచేశారు. సమాజానికి అంకిత భావంతో ఆయన చేసిన సేవలు మరువరానివని ముఖ్యమంత్రి తన సంతాపంలో పేర్కొన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి వాంగ్‌కి లోవాంగ్ కూడా తన సంతాపం తెలియజేశారు. గురువారం స్వగ్రామం నమ్సంగ్‌లో రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన కుటుంబానికి సహాయంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News