Tuesday, April 30, 2024

ఏనుగు దాడిలో మరో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్‌పై బుధవారం ఏ నుగు దాడి చేసి చంపివేసిన ఘటన మరువకముందే గురువారం పెంచికల్‌పేట్ మండలం, కొండపల్లిలో ఏనుగు మరోసారి తన ప్రతాపం చూపించింది. వివరాల్లోకి వెళ్తే…గురువారం ఉద యం గ్రామానికి చెందిన కారు పోశం (65) అనే రైతు తన పొలానికి నీరు పెట్టడానికి మోటార్ వేయడానికి వెళ్తుండగా గ్రామ పంచాయితీ కార్యాలయం సమీపంలో అతనిపై ఏనుగు దాడి చేసి హతమార్చింది.

మాజీ సర్పంచ్ ఉపాసి సంజీవ్ పలువురు యువకులతో కలిసి వ్యాయమం కోసం గ్రామం నుండి లోడ్‌పల్లి వైపు వెళ్తుండగా రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని చూసి పరిశీలించగా ఏనుగు దాడి ఆనవాళ్లు కనపడడంతో సంబంధిత అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, కాగజ్‌నగర్ డిఎస్‌పి కరుణాకర్, కాగజ్‌నగర్ రూరల్ సిఐ రాంబాబు, తహసిల్దార్ వెంకటేశ్వర్‌రావు పరిశీలించి, దాడి జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయండి: గ్రామస్థుల ఆందోళన
గజరాజు దాడిలో మరణించిన రైతు కారం పోశం కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఒకదశలో మృతదేహానికి పోస్టుమార్టంకు సైతం సహకరించకపోవడంతో ఒక్కసారిగా సంఘటన స్థలం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 2020 నవంబర్ 29న పత్తి రైతు పసుల నిర్మలపై పెద్దపులి దాడి చేసి హతమార్చగా బాధిత కుటుంబానికి అప్పటి అటవీ శాఖ మంత్రి, అధికారులు ఎన్నో హామీలు ఇచ్చి కేవలం రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అందువల్లనే అధికారులపై నమ్మకం లేదని ఆరోపించారు. కాగజ్‌నగర్ డిఎస్‌పి, రూరల్ సిఐ, ఎఫ్‌అర్‌ఓ, తహసిల్దార్, మాజీ జడ్‌పిటిసి సుధాకర్ మృతుడి బంధువులు, గ్రామ పెద్దలతో చర్చలు జరిపి బాధితునికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం మొదలైన అంశాలతో రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

భయందోళనలో పరిసర గ్రామాల ప్రజలు…
కొండపల్లిలో గురువారం వేకువ జామున ఏనుగు దాడి చేయడంతో ఒక్కసారిగా కొండపల్లి గ్రామం, లోడ్‌పల్లి ఇతర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చింతలమానేపల్లిలో ఏనుగు దాడి అనంతరం ఆధికారులు అప్రమత్తం చేస్తే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని వాపోతున్నారు. గురువారం దాడి అనంతరం అప్రమత్తమైన అధికారులు ఏనుగు కదలికలు ఉండడంతో పెంచికల్‌పేట్ బెజ్జూరు రహదారిపై వాహనాలను కొంత సమయం పాటు అనుమతించలేదు. అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేయించి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

‘ప్రతిరోజూ ఉదయం వ్యాయామానికి వెళ్లే క్రమంలో గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో లోడ్‌పల్లి వైపు వెళ్లి తిరిగి వస్తుండగా పంచాయతీ కార్యాలయం వద్ద ఏనుగు ఎదురైంది. అదే సమయంలో గ్రామం నుండి వస్తున్న వారికి ఏనుగు ఉందని హెచ్చరించచాను. దీంతో నా అరుపులు విన్న ఏనుగు నన్ను వెంబడించింది. అది చూడడానికి చాలా కోపంగా ఉంది. దాదాపు రెండు కిలోమీటర్లు నన్ను వెంబడించింది. నేను పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాను’ అని ప్రత్యక్ష సాక్షి ఎల్కరి సుధాకర్ తెలిపారు.
‘ఏనుగు వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు రాత్రి, పగలు జాగ్రత్తగా ఉండాలి. దాడి అనంతరం ఏనుగు కోసం గాలించగా అది ప్రాణహిత చేవెళ్ల కాల్వల పక్క నుండి సంచరిస్తూ పక్కనున్న సలుగుపల్లి అడవిలోకి వెళ్లింది. అడవిలో దానిని గుర్తించడం సాధ్యం కాదు. పరిసర గ్రామాలైన సలుగుపల్లి, జైహింద్‌పూర్, కొండపల్లి, లోడ్‌పల్లి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలపాలి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుండి ప్రాణహిత నదీ తీరం వెంబడి వచ్చి ఉంటుంది. చింతలమానేపల్లి మండలం, బూరేపల్లిలో, కొండపల్లిలో ఇద్దరు రైతులపై దాడి చేసి హతమార్చిన ఏనుగు ఒక్కటే కావచ్చు’ అని ఎఫ్‌ఆర్‌ఓ సుధాకర్ తెలిపారు.

చెరో రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేసియా
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో కారుపోషన్న అనే వ్యక్తి ఒకరు కాగా, అల్లూరి శంకర్ అనే మరో వ్యక్తి మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధగా ఉందని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ఆసిఫాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించిన ఏనుగు వరుస దాడుల నేపథ్యంలో చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, బెజ్జూర్, దహెగాం ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News