Friday, May 17, 2024

జూన్ 18కి యుజిసి ఎన్‌ఇటి వాయిదా

- Advertisement -
- Advertisement -

యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షకు పోటీ కాకుండా నివారించేందుకు జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఇటి- నెట్) తేదీని మార్చినట్లు, ఈ పరీక్షను ఇక జూన్ 18న నిర్వహించనున్నట్లు యుజిసి చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఇంతకు ముందు ఈ పరీక్షను జూన్ 16న నిర్వహించాలని సంకల్పించారు. ‘యుపిఎస్‌సి ప్రిలిమ్స్ తేదీ అవే అయినందున పరీక్ష గురించి అభ్యర్థుల నుంచి అందిన సమాచారం కారణంగా యుజిసి– ఎన్‌ఇటిని జూన్ 16 (ఆదివారం)

నుంచి జూన్ 18 (మంగళవారం)కి మార్చాలని జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ), యుజిసి నిర్ణయించాయి. ఎన్‌టిఎ ఒకే రోజు దేశవ్యాప్తంగా ఒఎంఆర్ పద్ధతిలో యుజిసి– ఎన్‌ఇటిని నిర్వహిస్తుంది’ అని కుమార్ తెలిపారు. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళశాలల్లో ‘జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ ప్రదానం,అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం’, ‘అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం, పిహెచ్‌డిలో చేరిక’, ‘పిహెచ్‌డిలో మాత్రమే చేరిక) కోసం భారత జాతీయుల అర్హత నిర్ధారణకు నిర్వహించే పరీక్ష యుజిసి– ఎన్‌ఇటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News