Thursday, May 16, 2024

3వ విడత ఎన్నికల్లో 123 మంది మహిళలు

- Advertisement -
- Advertisement -

వచ్చేనెల 7వ తేదీ (మే 7)న జరిగే లోక్‌సభ మూడో విడత ఎన్నికల్లో 123 మంది మహిళలు పోటీలో ఉన్నారు. మొత్తం 1352 మంది బరిలో ఉండగా మహిళల సంఖ్య ఇందులో ఇంత మంది ఉండగా, వారిలో 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఎడిఆర్) తమ అధ్యయనం తరువాత వెలువరించిన నివేదికలో తెలిపింది. అభ్యర్థినులు రంగంలో ఉన్నారు. ఇక వీరిలో ఏడుగురు అభ్యర్థినులపై తమ నామినేషన్ పత్రాలలో తమ దోషిత్వం కూడా నిర్థారణ అయిందని తెలియచేసుకున్నారు. అయితే వీరు కూడా మూడో దఫా ఎన్నికలలో ఎంపి స్థానాలకు పోటీలో ఉన్నారని వెల్లడించారు. ఈ ఎన్నికలలో పోటికీ దిగిన వారెందరు? వీరిలో ఎందరిపై క్రిమినల్ కేసులున్నాయి? ఇవి ఏపాటి తీవ్రతతో ఉన్నాయనే విషయాలను ఎడిఆర్ ,

ది నేషనల్ ఎలక్షన్ వాచ్‌లు పూర్తి స్థాయి పరిశీలనల తరువాత తమ బాధ్యతగా నివేదిక రూపంలో తెలియచేస్తున్నాయి. మూడో దఫా పోలింగ్‌కు దిగిన వారిలో 244 మందిపై క్రిమినల్ కేసులు రికార్డు అయ్యాయి. వీరిలో ఐదుగురిపై హత్య కేసులు ఉండగా, 24 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు. మరో 38 మందిపై మహిళలపై లైంగిక దాడులు, ఇతరత్రా నేరాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 17 మందిపై విద్వేషకర ప్రసంగాల కేసులు ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ ఆ సంస్థలు అభ్యర్థులు దాఖలు చేసుకున్న స్వీయ ప్రకటిత నామినేషన్ పత్రాల క్రమంలో తెలియచేసుకున్నవే. గడిచిన రెండు విడతల పోలింగ్ దశల్లోని అభ్యర్థులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ విధంగా ప్రజాస్వామిక ఎన్నికలలో నేరచరితులు చట్టసభల్లోకి ప్రవేశించే ఘట్టం మరోసారి రుజువు అయింది.

కీలక పార్టీలలో నేరచరితులు ..ఆందోళనకరం
అభ్యర్థుల నేర పూర్వాపరాలు, వారి ధన సముపార్జన వంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. హత్యలు, హత్యాయత్నాలు, రేప్‌లు, మహిళలపై దాడుల వంటి ఉదంతాలతో ప్రమేయం ఉన్నవారు పలు ప్రముఖ రాజకీయ పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగారని వెల్లడైంది. ప్రత్యేకించి బిజెపి, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ వంటి పార్టీలకు చెందిన వారు టికెట్లు దక్కించుకుని ఇకపై ప్రజా ప్రతినిదులుగా వచ్చేందుకు, ఇంతకు ముందటి తమ ఎంపి సీట్లను పదిలపర్చుకునేందుకు మరో మారు యత్నిస్తున్నారని, ఇది ఆందోళనకరమని ఎడిఆర్ తెలిపింది. ఇక బరిలో నిలిచిన వారి ఆర్థిక స్థితిగతుల విషయానికి వస్తే భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బరిలోని వారిలో 29 శాతం వరకూ అంటే 392 మంది అభ్యర్థుల వరకూ కరోడ్‌పతిలుగా ఉన్నారు. సగటున కలిపే చూస్తే వీరి ఆస్తులు రూ 5.66 కోట్లు దాటాయి. ఇక ఈసారి ఎన్నికలలో ఇప్పటివరకూ బరిలోకి దూకిన వారిలో ముగ్గురి ఆస్తులు వందల కోట్లు దాటి ఉన్నాయి. వీరిలో ఒక్కరి ప్రకటిత ఆస్తి మొత్తం రూ 1,361కోట్లు అని వెల్లడైంది. ఇక నామినేషన్ల పత్రాల దాఖలు తరువాతి పరిణామంలో ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.

విద్యార్హతల విషయం
47 శాతం మంది 5 నుంచి ఇంటర్ వరకే చదువులు
ఎడిఆర్ వెలువరించిన నివేదిక క్రమంలో అభ్యర్థుల విద్యార్హతల వివరాలూ ముందుకు వచ్చాయి. 47 శాతం లేదా 639 మంది ఐదవ తరగతి నుంచి 12 వ క్లాసు చదువుకున్న వారు ఉన్నారు. కాగా 44 శాతం లేదా 591 మంది గ్రాడ్యుయెట్లు ఉన్నారు. ఇక వయస్సు పరంగా చూస్తే 30 శాతం అంటే 411 మంది వరకూ 25 ఏండ్ల నుంచి 40 ఏండ్లలోపు వారు ఉన్నారు. కాగా 53 శాతం అంటే 712 మంది 41 నుంచి 60 ఏండ్ల లోపు వారు ఉన్నారు. మూడో విడత పోలింగ్ బరిలో అభ్యర్థుల సంఖ్యను చూస్తే మహిళల ప్రాతినిధ్యం కేవలం 9 శాతం ఉందని, ఇది కనీసం చట్టసభలో మహిళల సరైన ప్రాతినిధ్యం ఎండమావిగా నిలుస్తుందని ఎడిఆర్ తెలిపింది.

పార్టీలను కట్టడి చేయాల్సి ఉంది
అన్నింటికీ మించి రాజకీయాలను నేర రహితం చేయాల్సి ఉంది. నేరస్తులు కేసుల్లో ఉన్నవారిపై ఎన్నికల అనర్హత వంటి కఠిన చర్యలకు దిగాల్సిందే. ప్రత్యేకించి హేయమైన నేరాలలో శిక్షలు పడ్డ వారు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది. ముందుగా కళంకితులను, అక్రమ సంపాదనాపరులను రంగంలోకి దింపే రాజకీయ పార్టీలను గుర్తించి ఆయా పార్టీలకు ఉన్న పన్ను మినహాయింపులను ఎత్తివేయాల్సి ఉంటుందని సూచించారు. నిజానికి అక్రమ సంపాదనపరుల అండదండలతోనే పార్టీ ఎన్నికల ప్రచార వ్యయ భారం నిర్వహణకు పార్టీలు దిగడం, ఈ క్రమంలోనే వారిపై ఉన్న కేసుల గురించి పార్టీలు పట్టించుకోకపోవడం చివరికి మిగిలేది కేవలం రాజకీయ మురికి కూపం అవుతుందని ఎడిఆర్ హెచ్చరించింది. ఎన్నికలే ప్రజాస్వామిక ప్రక్రియలో కీలకమైనందున సంబంధిత ఎన్నికల సంస్కరణలు అత్యంత కీలకం. భారత రాజకీయ ముఖచిత్రాన్ని మరింత పారదర్శకంగా ఉంచాల్సి ఉంది. జవాబుదారితనం తక్షణ అవసరం అని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News