Sunday, July 13, 2025

బరువు తగ్గాలనుకుంటున్నారా..? రాత్రి పడుకునే ముందు ఈ 5 డ్రింక్స్ తాగండి..

- Advertisement -
- Advertisement -

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఆఫీస్ వర్క్ చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. బరువు తగ్గేందుకు జిమ్‌కి వెళ్తున్న, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకున్న ఫలితం లేకుండాపోతుంది. అయితే రాత్రిపూట కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

జీలకర్ర టీ
జీలకర్ర, పుదీనా, అల్లం కలిపి దాదాపు 10 నిమిషాల పాటు నీటిలో మరిగించాలి. తిన్న అరగంట తర్వాత ఈ డ్రింక్ తాగితే కొవ్వు కరిగిపోతుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా శుభ్రం చేస్తుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో బరువు తగ్గుతాం. రాత్రిపూట గ్రీన్ టీ తాగితే, నిద్రలోనూ కేలరీలు బర్న్ అవుతాయి.

దాల్చిన చెక్క నీరు
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. రాత్రిపూట తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పుదీనా టీ
పుదీనా టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి నిద్రకూ సహాయపడుతుంది. కొవ్వు కరిగిస్తుంది.

నిమ్మకాయ నీరు
రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రకు ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే శరీరంలోని టాక్సిన్లు బయటికివస్తాయి. జీర్ణక్రియను మెరుగుపడుతుంది. శరీరంలోని కొవ్వును ఇట్టే కరిగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News