జలవివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ కేంద్ర
జలశక్తి మంత్రి పాటిల్ నేతృత్వంలో సమావేశం
ఇరు రాష్ట్రాల సిఎంలకు సమాచారం రేపు ఢిల్లీకి
బయలుదేరనున్న సిఎం రేవంత్‌రెడ్డి కృష్ణా గోదావరి
జలాల్లో రాష్ట్ర వాటా సాధనకు కేంద్రంపై ఒత్తిడి
తేవాలని సిఎం నిర్ణయం కృష్ణాపై రాష్ట్రంలో
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని
కేంద్రాన్ని కోరనున్న రేవంత్ నీటి కేటాయింపులు,
ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై కేంద్రానికి విజ్ఞప్తి
చేయనున్న ముఖ్యమంత్రి సిఎం ఆదేశాలతో కేంద్ర
జలవనరుల మంత్రికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ
మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 16వ తేదీ న ఇరు రాష్ట్రాల సిఎంలతో సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తె లంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబునాయుడులను ఆహ్వానిస్తూ సోమవారం జలశక్తి శాఖ సర్కుల్ జారీచేసింది. తెలు గు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స మావేశం న్యూ ఢిల్లీ లో 16వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగనున్నది. ఇదిలా ఉండగా, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను సాధించేందుకు కేం ద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సి ఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృ ష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యా యపరంగా రావాల్సిన నీటి వా టాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.
రేపు ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లి బుధ, గురురవారాలు(జులై 16, 17 తేదీలు) అక్కడే ఉంటారని సమాచారం. బిసి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్ఠానంతో భేటీకానున్నట్టు తెలిసింది. ఈనెల 15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పి.వి నరసింహారావు సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.