Tuesday, July 15, 2025

అటు సూర్యుడు ఇటు పొడిచినా…బిసిలకు 42% రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

త్వరలోనే స్థానిక ఎన్నికలు బలహీనవర్గాలకు
అధికారం అప్పగించడమే మా లక్షం
లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం
అయింది ప్రాజెక్టులపై నాగార్జునసాగర్
కట్టపై చర్చిద్దామా? మేడిగడ్డ కూలిన చోట
బిఆర్‌ఎస్ నేతలను ఉరి తీసినా తప్పులేదు
పల్లెపోరులో గంజాయి మొక్కలు మొలవకూడదు
ఎవరొచ్చినా..సచ్చినా పదేళ్లు కాంగ్రెస్‌దే
అధికారం 3.10కోట్ల మందికి సన్నబియ్యం
బువ్వ రేషన్‌కార్డు పేదోడి ఆత్మగౌరవం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి
నియోజకవర్గంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
కార్యక్రమం ప్రారంభించిన అనంతరం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి :‘స్థానిక’ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి పట్టణంలో సోమవారం నిర్వహించి న కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పం పిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ .. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించనున్నామని అన్నారు. అ టు సూర్యుడు ఇటు పొడిచినా బిసిలకు స్థానిక సంస్థల ఎ న్నికల్లో రిజర్వేషన్ కల్పించి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు. నల్లగొండ ప్రజలకు, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన పథకాల ప్రాధాన్యతను వివరించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా పోరాటాల చరిత్ర గలదని, పౌరుషాలు చూపిన నాయకులు, ప్రజలు ఈ నేలకే చెందారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రే రణ కలిగించిన జిల్లాల్లో నల్లగొండే ప్రధాన స్థానమని అ న్నారు.

లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిటన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయిందని, కానీ 70 ఏళ్ల కిం దట కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ నిలకడగా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల వంటి అనేక ప్రాజెక్టులు నిలబడలేకపోయాయని, బిఆర్‌ఎస్ నేతలను సుందిళ్ల కాడ ఉరేస్తే తప్పేమీ లేదని అన్నారు. ఇప్పటికీ నల్లగొండ జిల్లాకు నీరు అందుతోందంటే అది కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే అని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి.. పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇవ్వడాన్ని కూడా ఆ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

నేడు రేషన్ కార్డు లేని వారికి అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని అన్నారు. ప్రజలు మాయలో పడరని, వారికి నిజమైన సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించామని, కానీ ఈ విషయంలో ప్రచారం చేయకూడదనే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. రైతు భరోసా విషయంలో విమర్శలు చేసినవారు తప్పుచేశారని, కానీ కేవలం 9 రోజుల్లోనే 1.48 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా మంజూరు చేశామని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ కోసం 21 వేల కోట్లు ఖర్చు చేసి రైతుల ఖాతాలో వేసామని గర్వంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 2 కోట్ల 85 లక్షల మెట్రక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని, రైతులు ఆనందంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందని అన్నారు. చారిత్రాత్మక, విప్లవాత్మక మార్పు తీసుకువచ్చి గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బదులు మంచి నాణ్యత ఉన్న సన్నబియ్యాన్ని 3.10 కోట్ల మందికి ఆరు కేజీల చొప్పున ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. తమది మార్గదర్శక పాలన, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డల కోసం ఈ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు పనిచేస్తుందని అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 స్థానాల్లో కాంగ్రెస్ నుండి తులసివనాలు గెలిచాయని, ఒక్క సూర్యాపేటలోనే బిఆర్‌ఎస్ నుండి గంజాయి మొక్క గెలిచిందని, ఆ ఏకలింగాన్ని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవకూడదని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ గంజాయి మొక్క ఉందని, దానిని పీకేసే బాధ్యత మీరే తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘బిఆర్‌ఎస్ నేతలంతా కట్టకట్టుకుని రండి… మీరంతా ఒకవైపు….మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు ఉంటారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలిపించండి’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News