Wednesday, July 16, 2025

హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాజు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రవితేజ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భూపతి రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రవితేజ, రఘు, మరొక కుమారుడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేట స్వస్థలం. భూపతి రాజు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలలో పని చేయడంతో రవితేజకు యాసలు ఒంటబట్టాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News