Saturday, July 19, 2025

ఈగల్ టీం దాడులు.. హైకోర్టులో పబ్ యజమానుల క్వాష్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పబ్ యజమానులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మల్నాడు రెస్టారెంట్‌పై ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసిన విషయం విదితమే. ఈ దాడుల్లో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య డ్రగ్స్ సరఫరాతో పాటు పలు పబ్‌ల నిర్వహకులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఈగల్ టీం నిర్దారించింది. దీంతో పాటు అతనిని కస్డడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ దాడుల్లో పోలీసులు క్వాక్ పబ్, కోరా పబ్, బ్రాడ్‌వే పబ్‌లపై కేసు నమోదు చేశారు. దీంతో పబ్ యజమానులు రాజశేఖర్, పృథ్వీ వీరమాచినేని, మాదిశెట్టి రోహిత్‌లు కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసును కొట్టివేయవద్దని, కేసులకు సంబంధించిన పూర్తి సాక్షాధారాలు ఉన్నాయని పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, స్నేహితుడు రాహుల్ తేజ్‌లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. కాగా, ఈ కేసులో మరో నాలుగు పబ్‌ల యజమానుల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News