న్యూయార్క్: హెచ్‌ఆర్‌తో సిఇఒ రోమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. అమెరికాలోని మసాచుసెట్స్ ప్రాంతం బోస్టన్ నగరంలో జరిగింది. కోల్డ్‌ప్లే కన్సర్ట్‌లో అస్ట్రోనామర్ సిఇఒ అండీ బైరన్, కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబట్‌ను కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించాడు. ఇద్దరు కౌగలించుకోవడంతో కెమెరాకు చిక్కడంతో కాబట్ ముఖం దాచుకోగా బైరన్ పరుగులు తీసి వెనక్కి దాచుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైరన్‌కు మెగన్ కెర్రిగన్ అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాబట్ కూడా భర్త ఉన్నాడు. మెగన్ తన ఫేస్‌బుఖ్ ఖాతా నుంచి బైరన్ పేరును తొలగించింది. ఆస్ట్రోనామర్ ఉద్యోగి అలిస్సా కూడా నవ్వుతూ కనిపించడంతో సోసల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు కంపెనీలో విషపూరిత సంస్కృతి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద కంపెనీకి సిఇఒగా ఉందిని ఇలాంటి పాడు పనులు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
View this post on Instagram