Monday, May 6, 2024

రివర్స్ మోడ్ లో కారు: సిఇఓ దుర్మరణం!

- Advertisement -
- Advertisement -

టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ దానిపై అవగాహన లేకపోతే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఏమరుపాటున  చిన్న పొరబాటు చేసినా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీ సిఇఓ చేసిన ఓ చిన్న పొరబాటు ఆమె ప్రాణాలనే బలిగొంది.

అమెరికాలో ఫార్ మోస్ట్ గ్రూప్ అనేది ఒక ప్రముఖ షిప్పింగ్ కంపెనీ. దీనికి ఏంజెలా చావో (50) సిఇఓ. అమెరికాలోనే ధనవంతుల కుటుంబాల్లో ఆమెది ఒకటి. ఆమె భర్త జిమ్ బ్రెయార్ ప్రముఖ వెంచర్ కేపిటలిస్టు. ఇక ఒకప్పుడు అమెరికా రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన ఎలాయినే చావోకు ఏంజెలా స్వయాన సోదరి. వీకెండ్ కావడంతో ఆమె శుక్రవారం రాత్రి స్నేహితురాళ్లతో కలసి టెక్సాస్ లోని తన ప్రైవేట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంటులో గడిపి రాత్రి పొద్దుపోయాక ఖరీదైన తన టెస్లా కారులో ఇంటికి బయల్దేరారు.

మార్గమధ్యంలో ఒక మలుపు తిరగవలసి ఉండగా ఆమె పొరబాటున కారును రివర్స్ మోడ్ లోకి మార్చారు. దీంతో కారు వెనక్కి వేగంగా వెళ్లి ఒక చెరువులో పడింది. ఆఖరి నిమిషంలో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేశారు. కానీ ఆమె వచ్చేలోగానే కారు నీళ్లలో మునిగిపోయింది. కారును బయటకు తీసి చూస్తే, ఏంజెలా అప్పటికే మరణించారు. ఏంజెలా, బ్రెయార్ దంపతులకు మూడేళ్ళ కొడుకు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News