Monday, July 21, 2025

సాగర్ ఎడమకాలువకు నీరు విడుదల

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణానది వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌పి అధికారులు ఆదివారం ఉదయం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తాగు నీటి అవసరాల కోసం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే కాకుండా పంటలకు సాగు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News