- Advertisement -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘విటి15’ (VT15)సినిమా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో, యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా వరుణ్ కెరీర్లోనే ఎంతో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్, -కామెడీ, ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇండియా, విదేశాల్లో(India,abroad) మూడు మేజర్ షెడ్యూ ల్స్ పూర్తి చేసి, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ అయ్యాయి. ఇవి సినిమాకే హైలైట్స్ కానున్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
- Advertisement -