Thursday, September 11, 2025

పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు పదిమంది ప్రత్యేక ఆఫీసర్లు గా ఐఏఎస్ లను నియమించింది. ఈ మేరకు జీఓ నెంబరు 999 పేరుతో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనిత రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్ కు హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్ కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ కు కె. శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News