Monday, July 28, 2025

ఒటిటిలోకి నితిన్ లేటెస్ట్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..

- Advertisement -
- Advertisement -

చాలాకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో నితిన్. అందుకోసం ఎంతో కష్టపడుతున్నా.. దానికి తగిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ ఏడాది మార్చిలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు నితిన్. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu Movie). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్‌కి ఈ సినిమా నిరాశే మిగిల్చింది.

ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్‌స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో సప్తమీ గౌడ్ హీరోయిన్‌గా నటించగా.. వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా (Thammudu Movie) ఒటిటి రిలీజ్ గురించి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 1వ తేదీ నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. మరి థియేటర్‌లో నిరాశ పరిచిన ‘తమ్ముడు’ ఒటిటిలో ఎలా అలరిస్తాడో చూడాలి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News