మన తెలంగాణ /హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా బి.పి.పాండే నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆఫీసు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం కొత్త ఛైర్మన్ ను నియమించడం పట్ల ఆసక్తి నెలకొంది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 సెక్షన్ 85 కింద మే 28 ఏర్పాటు చేశారు. ఈ బోర్డు కేంద్ర జలశక్తి అధీనంలో పని చేస్తుంది. గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాటాల నిర్వహణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారంపై ఇది పనిచేస్తుంది. కాగా ప్రస్తుతం బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా కేంద్ర జలశక్తి శాఖ బి.పి.పాండేను కొత్త చైర్మన్ గా నియమించింది. తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు వివాదంపై కొత్త చైర్మన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా బి.పి పాండే
- Advertisement -
- Advertisement -
- Advertisement -