Monday, August 4, 2025

దేవుడి కోసం ఆత్మార్పణం… భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేవుడి కోసం ఆత్మార్పణం చేసుకుంటున్నానని ఓ వివాహిత ఐదు అంతస్తు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని నారాయణగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హిమాయత్ నగర్ లోని ఉర్దు హాల్ ఎదురుగా ఉన్న ఆపార్ట్ మెంట్ లో అరుణ్ కుమార్ జైన్(48), పూజా జైన్(43) నివసిస్తున్నారు. ఈ దంపతులు 22 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజుల పూజా జైన్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె ఆద్యాత్మిక వైపు అడుగులు వేశారు. శనివారం ఉదయం భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. ఇంట్లో పని మనిషి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఇంట్లో పూజలు చేసిన అనంతరం ఐదో అంతస్తు నుంచి దూకింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పూజ కూర్చున్న గదిలో ఓ లేఖ కనిపించింది. అనునిత్యం దైవ ధ్యానంలో ఉంటూ ఆత్మార్పణం చేసుకుంటే దేవుడికి దగ్గరవుతానని, స్వర్గం ప్రాప్తిస్తుందనే అర్థం కూడిన జైన గురువుల సూక్తి రాసి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News