మనతెలంగాణ/ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం పొత్తూరులో ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్ షాపులపై ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలేన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకే సారి గ్రామంలోని శ్రీరామ ఫెర్టీలైజర్ ఫెస్టీసీడ్స్, చంధ్రశేఖర్ ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్, రాజరాజేశ్వర, శ్రీనివాస షాపులపై తనీఖీలు చేపట్టారు. ఓ వైపు మండలంలో తీవ్రంగా యూరియా కోరత ఏర్పడుతుందని, రైతులు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో ఈ మెరుపు దాడులతో ఒక్క సారిగా అలజడి నెలకొంది. గ్రామంలో డీసీఎంఎస్ గోదాంలను కూడా క్షున్నంగా తనీఖీ చేశారు. ప్రెవేటు డీలర్లకు సంభంధించిన గోదాంలలో, షాపులలో రోజువారి కి సంబంధించిన స్టాక్ కు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు.
అదే విధంగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.19లక్షల71వేల514 విలువ గల స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. రైతులకు అండగా నిల్వాల్సిన సమయంలో, ఎరువుల బస్తాలను ఎక్కువ మొత్తంలో రేటుకు అమ్ముతున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వారు తెలిపారు. ఎవరైన అక్రమంగా ఎరువుల బస్తాలను దాచిన, ఎక్కువ రేట్లకు అమ్మిన , కాలం చెల్లిన మందులను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజిలేన్స్ తహసీల్దార్ దినేష్, చంద్రారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ లు అనిల్ కుమార్, వరున్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ఎం సురేష్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.