Saturday, May 18, 2024

మేడిగడ్డకు భారీ నష్టం

- Advertisement -
- Advertisement -

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ రతన్ వెల్లడి

ప్రభుత్వ ఆదేశాలతోనే క్షేత్రస్థాయి పరిశీలన

త్వరలో ప్రభుత్వానికి నివేదిక

మన తెలంగాణ/మహదేవ్ పూర్/కాళేశ్వరం/హైదరాబాద్: అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యా రేజీ అధికంగా నష్టపోయిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ రతన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి మహదేవ్‌పూర్ మండ లం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ ఐజి ప ర్యటన రెండవ రోజు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ, కన్నెప ల్లి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ముందుగా కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకొని మో టార్లు, అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజీ వద్ద పిల్లర్లపై నడుస్తూ వెళ్లి బుంగలు పడ్డ పిల్లర్లను కెమికల్‌తో నింపిన ప్రదేశాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ మ్యారేజీ 21 పి ల్లర్ కింద జరిగిన నష్టాన్ని పరీక్షించారు. పిల్లర్‌ను దగ్గరుండి పరిశీలించేందుకు కృంగింది అ నే వివరాలు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీ భారీగా నష్టం జరిగిందని తమ పరిశీలన లో తేలిందని అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన రికార్డులు, హార్డ్ డిస్క్‌లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చే సుకుందన్నారు. ప్రభుత్వ  ఆదేశాల మేరకే మళ్లీ క్షేత్ర సహాయ పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపిస్తామని తెలిపారు.

అన్నారం బుంగల పూడ్చివేత పనులు పూర్తి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా గోదావరి నదిపై నిర్మించిన అన్నారం బ్యారేజిలో బుంగల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో బ్యారేజి 28,38 పియర్‌ల వద్ద పెద్ద ఎత్తున నీటి బుంగలు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు ఇసుక బస్తాలు , రాళ్లు అడ్డుగా వేసి బుంగలను తాత్కాలింగా పూడ్చివేసి నీటి లీకేజిని ఆపగలిగారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం అన్నారం బ్యారేజిని తనిఖీ చేసింది. బ్యారేజిలో ఏర్పడిన బుంగల వల్ల ప్రమాదం లేదని అభిప్రాయపడింది. ఈ బ్యారేజిని నిర్మించిన కాంట్రాక్టు కంపెనీతోనే గ్రౌటింగ్ ప్రక్రియ ద్వారా బుంగలను శాశ్వితంగా పూడ్చివేయించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఇందులో భాంగంగానే ఆప్కాన్ కంపెనీ అన్నారం బ్యారేజి బుంగల పూడ్చివేత ప్రక్రియను చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హెలికాప్టర్ ద్వారా పాలియూరిధిన్ అనే కెమికల్‌ను తెప్పించింది. బ్యారేజి 38,28 పిల్లర్ల వద్ద బుంగలను గ్రౌటింగ్ పద్దతి ద్వారా పూడ్చివేయించింది. బ్యారేజి రిపేర్ల ప్రక్రయ ముగిసిందని, ఇకపై బ్యారేజిలో నీటిని నిలుపుకోవచ్చని వెల్లడించింది. బ్యారేజిని పూర్థి స్థాయి సామర్ధం మేరకు నీటితో నింపినప్పటికీ ఎటువంటి లీకేజిలు ఉండవని భరోసానిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News