Sunday, June 16, 2024

పది రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పెళ్లి బట్టల కోసం హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అనంతపురం రాణినగర్‌కు చెందిన సాహెబ్ ఇంట్లో ఈ నెల 27న పెళ్లి వేడుకలు ఉన్నాయి. తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో పెళ్లి బట్టల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పెళ్లి బట్టలు తీసుకొని ఇంటకి వెళ్తుండగా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గుత్తి సిఐ వెంకట్రామి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులు అలీ సాహెబ్(58), రెహనాబేగం(40), షేక్ సురోజ్‌భాషా(28), మహ్మద్ అయాన్(06), అమాన్(04)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News