Saturday, May 4, 2024

వివాహం పేరుతో మోసం..రూ.1.80కోట్లు కొట్టేసిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

విడోను వివాహం చేసుకుని అమెరికా తీసుకుని వెళ్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం, మోగరాల పోస్టు, వలపల వారిపల్లికి చెందిన కొమ్మినేని వంశీచౌదరి అలియాస్ కృష్ణ వంశీ అలియాస్ కన్నయ్య నిరుద్యోగి. 2009లో డిగ్రీ డిస్‌కంటీన్యూ చేసిన నిందితుడు తర్వాత బెంగళూరుకు వెళ్లి అక్కడ గ్లాస్ కట్టర్‌గా ప్లయ్‌వూడ్ షాపులో పని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారిని టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నాడు. ఓ నిరుద్యోగిని మోసం చేయడంతో కర్నాటక రాష్ట్రం, బెంగళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్,చిత్తూరు జిల్లా పాకాల పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

క్రికెట్‌ బెట్టింగ్ తదితరాల వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు షాదీ.కామ్‌లో వివాహం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులోనే కొండాపూర్‌కు చెందిన భర్త చనిపోయిన మహిళ(35)ను చేసుకునేందుకు ఆసక్తి చూపాడు. ఆమెకు తాను గూగుల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు, అంతే కాకుండా నకిలీ ఐడి కార్డును వారికి చూపించాడు. నిందితుడు బాధితురాలు,ఆమె తల్లిదండ్రులను నమ్మించేందుకు అమెరికా మొబైల్ నంబర్‌తో మాట్లాడేవాడు. ఇద్దరు తరచూ వాట్సాప్, ఫోన్‌లో మాట్లాడేవారు. కొద్ది రోజుల తర్వాత తన తల్లిదండ్రులు సదరు బాధితురాలిని వివాహం చేసుకునేందు అంగీకరించడంలేదని, ఇద్దరు పిల్లలు ఉన్నారని అభ్యంతరం చెబుతున్నారని చెప్పాడు. అయినా తాను వివాహం చేసుకుని అమెరికా తీసుకుని వెళ్తానని నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత తన బ్యాంక్ ఖాతాలను కుటుంబ సభ్యులు తీసుకున్నారని,

ఐటి శాఖ కొన్ని బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిందని, డబ్బులకు ఇబ్బంది ఉందని చెప్పాడు. దీంతో బాధితురాలు తన మూడు బ్యాంక్ ఖాతాల నంబర్లు, క్రెడెన్షియల్స్ ఇచ్చింది. దీంతో నిందితుడు ఆమె బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి బంగారు ఆభరణాలు తదితరులను కొనుగోలు చేసేందుకు రూ.1.80కోట్లు వాడుకున్నాడు. తర్వాత నుంచి మొబైల్ నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్స్‌స్పెక్టర్ రమేష్, ఎఎస్సై వినాయక్‌రావు, పిసిలు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, అరవింద్ గౌడ్, నారాయణరావు తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News