Sunday, July 21, 2024

నేడు మెదక్ లో  బంద్

- Advertisement -
- Advertisement -

మెదక్: బక్రీద్ సందర్భంగా ఓ వర్గానికి చెందిన వారు గోవులను తరలిస్తుండగా బిజెవైఎం నాయకులు అడ్డుకోవడంతో మెదక్ లో ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓ వర్గం వారు కత్తులతో దాడి చేయడంతో హిందూ సంఘాలు, బిజెవైఎం కార్యకర్తలు ఆదివారం మెదక్ పట్టణం బంద్ కు పిలుపునిచ్చారు.

మెదక్ నగర సెంటర్లలో, మార్కెట్ ప్రదేశాల్లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి బందోబస్తును విస్తృతం చేశారు. మెదక్ ప్రధాన కూడల్లలో నిర్మానుష్యం చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News