Tuesday, June 18, 2024

వాటర్ ఫాల్స్ దగ్గర పెరిగిన వరద… పరుగులు తీసిన జనం… బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: వాటర్ ఫాల్స్ దగ్గర ఒక్కసారిగా వరద పెరగడంతో పర్యాటకులు పరుగులు తీశారు.  తమిళనాడు రాష్ట్రం కుర్తాళం వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాటర్ ఫాల్ నుంచి వరద వస్తున్న విషయం జలశాఖ అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి కదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వరదలు, వానలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లకపోవడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News