Saturday, August 16, 2025

పార్టీ ముఖ్యనేతలతో కెసిఆర్‌ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ సహా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కెసిఆర్ ఎర్రవెళ్లి నివాసంలో శుక్రవారం జరిగిననీ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు సమాచాం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయంపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News