మొయినాబాద్ మండలం బాకారం ఫామ్‌హౌస్‌లో అడ్డంగా దొరికిన 51మంది
భారీస్థాయిలో విదేశీ మద్యం స్వాధీనం
గంజాయి సేవించినట్లు సమాచారం
మన తెలంగాణ/మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, బాకారంలోని ఎస్‌కెఎం ఫామ్‌హౌస్‌లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో విదేశీయులు అడ్డంగా పట్టుబడ్డారు. అనుమతిలేని పార్టీలు చేసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఈ సందర్భంగా ఉగాండాతో పాటు కెన్యా దేశానికి చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాజేంద్ర నగర్ డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఆ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేని పార్టీ జరుగుతున్న ట్లు తెలుసుకున్న పోలీసులు అధికారులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితులు అనుమానంగా అనిపించి దాడి చేయగా వారిలో చాలా మంది డ్రగ్స్, గంజాయి సేవించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడున్న వారందరినీ అధికారులు అదుపులోకి తీసు కున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ డిసిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
బాకారంలోని ఓ ఫామ్ హౌస్‌లో మామ స్ అనే ఉగాండాకు చెందిన మహిళ పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇండియాలో ఆమె వీసా గడువు ముగి సినప్పటికీ అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో 65 బీరు సీసాలు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫాంహౌస్‌లో ఎక్కువగా కార్లు ఆగి ఉండడం, డిజె సౌండ్‌తో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఎస్‌ఓటి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఉదయం పకడ్బందీగా పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 51 మంది పట్టుబడడం సంచలనంగా మారింది. పట్టుబడిన వారిలో 37 మంది మహిళలు కాగా 14 మంది పురుషులు ఉన్నారు. వారిలో 12 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది.
విదేశీ మందు బాటిళ్లతో పాటు డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం ఉండడంతో పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా విదేశీయులు పార్టీ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఉందా లేదా విదేశీ మద్యం ఎక్కడి నుండి తెచ్చారనే కోణంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు బాకారం సమీపంలోని ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండడంతో ఆ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఇక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ప్రస్తుతం వీరితో పాటు మిగిలిన వారి వీసాలను చెక్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఇమిగ్రేషన్ అధికారులను ప్రత్యేకంగా పిలిపించినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ చెకిం గ్ పూర్తయిన వెంటనే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డిసిపి శ్రీనివాస్ తెలిపారు.