Friday, August 22, 2025

గాజుల పల్లెలో ఆరోగ్య వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ / ఎల్లారెడ్డిపేట ః మండలంలోని వెంకటాపూర్ గాజుల పల్లెలో గురువారం పిహెచ్ సి సిబ్బంది ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండ ఇంటి ఇంటి సర్వేలో భాగంగా పారిశుద్యంపై అవగహన కల్పించారు. దోమలు, విష కీటకాలు వ్యాప్తి చెందకుండ ఇంటి పరిసరాలలో, రహదారులపై ఉన్న గుంతలు, మురికి కాలువలలో వర్షపు నీరు నిలువ ఉండ కుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత సామాన్లు టైర్లు, డబ్బాలు, ఎప్పటికప్పుడు తీసి గ్రామ పంచాయతీ చెత్త బండికి ఇవ్వాలని తెలిపారు. అనంతం నిర్వహించిన శిభిరంలో 56 మందికి డెంగ్యూ, మలేరియా సంబంధిత పరీక్షలు చేసి రిపోర్టులు అంద చేసినట్లు సూపర్ వైజర్ డి పద్మ తెలిపారు. ఉచిత మందులు పంపిణీ చేసి ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది బి లక్ష్మి ప్రసన్న, ఎన్ స్పప్నా దేవి, సునీత, స్వప్న, జిపి కార్యదర్శి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News