Friday, August 22, 2025

రూ.2 కోట్ల విలువ 424 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల పరిధిలోని వెంకట్యాతండా సమీపంలో లారీలో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు డిఎప్‌పి చంద్రభాను శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..వెంకట్యాతండా సమీపంలో సిసియస్ పోలీసులు, టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వస్తున్న ఒక లారీని తనిఖీ చేయగా 424.950 కేజీల గంజాయి లభించింది. దీని విలువ మార్కెట్లో 2 కోట్ల12 లక్షల 47 వేలు ఉంటుంది. నిందితులు ఒడిశాలో కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నారు. నిందితుల్లో ప్రభులాల్ గుర్జార్, శివరాజ్ గుర్జార్ పట్టుబడగా రాంబాబు, నారాయణ గుర్జార్ పరారీలో ఉన్నారు. మీడియా సమావేశంలో సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐలు రాజేందర్, శ్రీకాంత్, సిసిఎస్ సిబ్బంది సిఐ రమాకాంత్, ఎస్‌ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News