మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న జనవ రి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సా మర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జా తికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్క ప్రకటించారు. 2022 అక్టోబర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతుల పై స్టే ఇవ్వగా దాదాపు రెండు సంవత్సరాల పా టు నాటి పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ ప నుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని డి ప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవా రం హైదరాబాద్ ప్రజాభవన్‌లో యాదాద్రి థర్మ ల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వేలకోట్ల పెట్టుబడి తో ప్రారంభించిన పరిశ్రమ ఒక్కరోజు ఆలస్యమైనా ఆర్థిక భారం తీ వ్రంగా రాష్ట్ర ప్రజలపై పడిందన్నారు. అందరి ఆ శీస్సులతో 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగా వెనువెంటనే 2024 ఫిబ్రవరిలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి పర్యావరణ అనుమతులను వెంటనే తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం వివరించారు. ఆనాటి నుంచి రోజువారిగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షణ చేస్తూ, ప్రతి వారం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులకు క్యాలెండర్ నిర్దేశించి ఆ మేరకు పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఆ క్రమంలోనే ఇప్పటికే రెండు యూనిట్లను జాతికి అంకితం చేశామని తెలిపారు. ప్రతివారం నిర్దేశించుకున్న పని పూర్తి కాకపోతే ఎందుకు కాలేదని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ప్రశ్నించి పనిని ముందుకు తీసుకుపోయామని తెలిపారు. వీటితోపాటు పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసేందుకు రైల్వే లైన్, కార్మికులు అధికారులు ఉండేందుకు టౌన్షిప్ ఏర్పాటు ఇవన్నీ నిర్దేశిత సమయాన్ని నిర్ణయించుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. బీహెచ్ఈఎల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లోని గ్రామాల్లో ప్రపంచ స్థాయి విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా సిఎస్ఆర్ నిధుల నుంచి అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పవర్ ప్లాంట్ పరిసరాల్లోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా , రహదారులు దెబ్బతినకుండా ప్రత్యేకంగా సిసి రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణ క్రమంలో భూ సేకరణకు అవసరమైన నిధులను మంజూరు చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కొద్ది మంది నాయకులు రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు.
కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో చేపట్టిన భద్రాద్రి పవర్ యూనిట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. దేశంలోనే అత్యున్నత, అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తికి తెలంగాణను కేంద్రంగా చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 17 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ఉచితంగా అర్హులకు అందిస్తుందన్నారు. పేదల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు వేల కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఓవైపు ఉచిత విద్యుత్ పథకాలు, మరోవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. భూ నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాలను కంప్యూటర్లో పెడితే వారు డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతారని, సమావేశం నిర్వహించడం డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం విమర్శించారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మానవ విలువలతో కూడింది, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోయేది కాదు, అంతా కలిసి ఒక కుటుంబ సంబంధంతో పండుగల నిర్వహించుకునే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం వివరించారు.
భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక సుదీర్ఘకాలంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్వాసితులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని గొప్ప సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా 500 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇవ్వగలిగామని డిప్యూటీ సీఎం తెలిపారు.నిర్వాసితులకు ఉద్యోగాల కోసం ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్, నాయకులు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా పోరాటం చేశారని, వారి సంకల్పం నేడు సాకాకరమైందని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన వారు ఉన్నారని తెలిపారు. నాటి యుపిఎ ప్రభుత్వ నిర్ణయంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించారని తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారికి కూడా భూములు కోల్పోతే ఉద్యోగాలు ఇవ్వాలని నేటి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆనాడు మానవీయ కోణంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నేడు ఆర్ఓఎఫ్ఆర్ నిర్వాసితులకు సైతం ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.
నాడు అబద్ధపు ప్రచారం చేశారు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని నాడు అబద్ధపు ప్రచారం చేశారని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గతంలో స్వయంగా తాను సబ్ స్టేషన్ వెళ్లి లాగ్ బుక్ లు చెక్ చేస్తే 12 గంటలు మాత్రమే ఇస్తున్నామని అన్నారని, కానీ 24 గంటలు అని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పడు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, వరి ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో తాతల కాలం నుండి వచ్చిన భూమిని త్యాగం చేసిన వారు ఉన్నారని, వారి త్యాగాన్ని వెలకట్టలేమన్నారు.