Sunday, August 24, 2025

క్లీన్ స్వీప్‌పై సౌతాఫ్రికా కన్ను

- Advertisement -
- Advertisement -

మాక్‌కె: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా (South Africa) ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో, చివరి వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. తొలి రెండు వన్డేల్లో బ్యాటింగ్ వైఫల్యం ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియాకు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న సఫారీ ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది.

కిందటి మ్యాచ్‌లో బ్రిట్జ్‌కే, స్టబ్స్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముల్డర్, మార్‌క్రమ్, బ్రెవిస్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ (South Africa batting) బలంగా ఉంది. అంతేగాక ఎంగిడి, బర్గర్, కేశవ్ మహారాజ్, బర్గర్, ముల్డర్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఆస్ట్రేలియా కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారే, హార్డి, నాథన్ ఎల్లిస్ వంటి స్టార్‌లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో ఇంగ్లిస్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కీలక ఆటగాళ్లు గాడిలో పడితే చివరి వన్డేలో విజయం సాధించడం ఆస్ట్రేలియాకు అసాధ్యమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News