Wednesday, September 18, 2024

సౌతాఫ్రికా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో : వన్డే ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి టీమ్ ఆస్ట్రేలియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం ఇక్కడి అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. సౌతాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (7), డేవిడ్ వార్నర్ (13)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు.

వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవెన్ స్మిత్ (19) కూడా విఫలమయ్యాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లింస్ (5) కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. అంతేగాక గ్లెన్ మాక్స్‌వెల్ (3), మార్కస్ స్టోయినిస్ (5) కూడా నిరాశ పరిచారు. దీంతో ఆస్ట్రేలియా 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మార్నస్ లబుషేన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి మిఛెల్ స్టార్క్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ లబుషేన్ (46), స్టార్క్ (27) కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. చివర్లో కెప్టెన్ కమిన్స్ (22) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. షంసి చివరి రెండు వికెట్లను తీయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 177 పరుగుల వద్ద ముగిసింది. సఫారీ బౌలర్లలోరబడా మూడు, జాన్సెన్, మహారాజ్, షంసి రెండేసి వికెట్ల తీశారు.

డికాక్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు బవుమా, క్వింటన్ డికాక్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బవుమా (35) పరుగులు చేశాడు. ఈ క్రమంలో డికాక్‌తో కలిసి తొలి వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. అద్భుత బ్యాటింగ్తో అలరించిన డికాక్ 106 బంతుల్లోనే 8 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. మార్‌క్రమ్ (56) కూడా తనవంతు పాత్ర పోషించడంతో సౌతాఫ్రికా స్కోరు 311 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News