ప్రముఖ నటి మధుశాలిని సమర్పకురాలిగా రూరల్ లవ్ స్టొరీ ‘కన్యా కుమారి’ (Kanya Kumari) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “ఈ సినిమాలో పంట పొలాలతో ఒక ప్రేమ కథని ముడి పెడుతూ చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది.
సినిమా స్క్రీన్ ప్లే చాలా బ్యూటిఫుల్ (Very beautiful) గా ఉంటుంది. గీత్ సైని చాలా అద్భుతంగా నటించింది. తన క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ చాలా క్యూట్‌గా కనిపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది”అని అన్నారు. డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ “బన్నీ వాసుకి ఈ సినిమా నచ్చడం ఆయన రిలీజ్ చేయడం మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. సినిమాలో ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది”అని పేర్కొన్నారు. మూవీ సమర్పకురాలు మధుశాలిని మాట్లాడుతూ “ఇంత మంచి సినిమాతో అసోసియేట్ కావడం, బన్నీ వాసు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ గీత్ సైని, హీరో శ్రీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.