Wednesday, August 27, 2025

ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ చేసిన గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేషుడికి దర్శించుకోవడానికి భక్తులు వర్షంలో కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద వినాయకుడికి తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు, పూజారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సరం బడా గణేషుడిని శ్రీ విశ్వశాంతి మహా గణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేషుడికి కుడివైపు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News