న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం ఖామైంది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత యువ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి 21-12, 21-19 స్కోరుతో విజయం సాధించారు. నువ్వా నేనా.. అన్నట్టు జరిగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జోడి ఆరన్ చియా, సొహ్ వూయి యిక్‌ల జోడీని మట్టికరిపించారు. ఈ గెలుపు సాత్విక్, చిరాగ్ జోడీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఈ భారత జోడికి దాదాపు పతకం ఖాయమైనట్లే. పారిస్ ఒలింపిక్స్‌లో మలేషియా జోడి చేతిలో ఓడిన ఇండియన్ షట్లర్లు క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రతీకారం తీర్చుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ను 43 నిమిషాల్లోనే ముగించారు. ఏషియన్ గేమ్స్ చాంపియన్స్‌గా నిలిచిన భారత జోడి మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో 11వ సీట్ ప్లేయర్లు చెన్ బో యాంగ్, లియు యితో తలపడనున్నారు.
Also Read : ఆసియా కప్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు