మన తెలంగాణ/ హైదరాబాద్: యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతున్నాయి. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కాకతీయ నైట్స్, బాసర వైద్యుట్స్ తలపడగా.. 4526 పాయింట్ల తేడాతో కాకతీయ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెస్ట్ రైడర్‌గా రఘువేందర్ రెడ్డి(కాకతీయ నైట్స్), బెస్ట్ డిఫెండర్‌గా శరణ్‌దీప్ నిలిచారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో భాగ్యనగర్ టైటాన్స్‌పై 4137 పాయింట్ల తేడాతో యాదాద్రి యోధాస్ జట్టు గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సాయి, గణేశ్‌లు బెస్ట్ రైడర్స్‌గా నిలిచారు. మూడో మ్యాచ్‌లో జోగులాంబ లయన్స్, భద్రాద్రి బ్రేవ్స్ పోటీపడగా జోగులాంబ జట్టు 4437 పాయింట్ల తేడాతో భద్రాద్రి బ్రేవ్స్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో రాజారెడ్డి(జోగులాంబ), హన్మంతు(భద్రాద్రి)లు బెస్ట్ రైడర్లుగా అవార్డులు అందుకున్నారు.
Also Read : భారత్ కు పతకం ఖాయం