Sunday, August 31, 2025

మోత్కూర్ లో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో బావిలో దూకి వివాహిత అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. బుజిలాపురం గ్రామంలో కాసగాని వెంకన్న(40), సరిత(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు కుమారుడు, కూతురు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవల జరుగుతున్నాయి. శనివారం రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామ శివారులో గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News