Sunday, August 31, 2025

బిసిల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడొద్దు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బలహీనవర్గాలకు అనుమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం వివరాలు సేకరించేందుకు బిసి కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చపై సందర్భంగా పురపాలక, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభలో సిఎం మాట్లాడుతూ..బిసిల్లో అపోహలు సృష్టించే విధంగా బిఆర్ఎస్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారని, బిఆర్ఎస్ గంగుల కమలాకర్ కు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలియజేశారు.బిసి బిల్లుపై గంగులకు సంపూర్ణ అవగాహన ఉందని భావిస్తున్నానని, వాళ్ల పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గంగుల కమలాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

బలహీనవర్గాలకు అనుమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని రేవంత్ సూచించారు. బిసిల్లో అపోహలు సృష్టించే విధంగా గంగుల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపామని, గంగుల కమలాకర్ అభినందిస్తారని తనకు తెలుసు కానీ ఆయన వెనకున్న వాళ్లు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఆరునూరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ సూచించారని, బిసి కమిషన్ కు ఇచ్చిన జివొ అయినా డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జివొ అయినా చిత్తశుద్ధి తో వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.

ఐదుసార్లు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశానని, అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ లో దీక్ష పెట్టామని, జంతర్ మంతర్ లో దీక్షకు దాదాపు వందమంది పార్లమెంటు సభ్యులు మద్దతు పలికారని అన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లకు రాజ్యసభ లో ఉన్న బిఆర్ఎస్ ఎంపిలు ఏం మాట్లాడలేదని, బలహీన వర్గాల వైపు మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఏం మాట్లాడరని రేవంత్ దుయ్యబట్టారు.

Also Read : సచివాలయం వద్ద బిఆర్‌ఎస్ మెరుపు ధర్నా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News