Sunday, August 31, 2025

బిసి బిల్లులకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును బిఆర్ఎస్ స్వాగతిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కు ఇప్పుడు మూడు ప్రొటో కాల్ పొజిషిన్లు ఉన్నాయని అన్నారు. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చపై సందర్భంగా పురపాలక, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా శాసనసభలో కెటిఆర్ మాట్లాడుతూ.. బిసి బిల్లులకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని, బిసిల కోసం గతంలో మాజీ సిఎం కెసిఆర్ అనేక పోరాటాలు చేశారని తెలియజేశారు.  ఒబిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కెసిఆర్  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారని, తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని నియమించామని అన్నారు. తెలంగాణ మొట్టమొదటి మండలి ఛైర్మన్ గా బలహీనవర్గాలకు చెందిన స్వామిగౌడ్ ను నియమించామని కెటిఆర్ పేర్కొన్నారు.

అడ్వకేట్ జనరల్ కూడా బిసిలను బిఆర్ఎస్ నియమించిందని, బలహీనవర్గాలకు చెందిన బిఎస్ ప్రసాద్ ను అడ్వేకేట్ జనరల్ గా కెసిఆర్ నియమించారని చెప్పారు. 2021 జనగణనతో పాటు కులగణన చేయాలని బిఆర్ఎస్ కోరిందని, కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే ముందే మాట్లాడింది కెసిఆర్ ప్రభుత్వమేనని కెటిఆర్ అన్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంటులో ఒబిసి రిజర్వేషన్లు తీసుకరావాలని అప్పట్లోనే తీర్మానించామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ వేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010 లో తీర్పు ఇచ్చిందని కెటిఆర్ స్పష్టం చేశారు.

Also Read: బిసిల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడొద్దు: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News