Monday, September 1, 2025

పతిభా సేతుతో యుపిఎస్‌సి అభ్యర్థులకు మేలు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంంలోని యువ ప్రతిభావంతులకు పోటీ పరీక్షలలో ఉపయోగపడేలా ప్రతిభా సేతు అనే పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. యుపిఎస్‌సి అభ్యర్థుల ప్రతిభా వికాసానికి, పరీక్షలలో తగురీతిలో సంసిద్ధతకు ఈ వేదిక ఉపయుక్తంగా మారిందని తెలిపారు. ఆదివారం ప్రధాని మోడీ ఈ ఆదివారం 125వ మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు సందేశం వెలువరించారు. అత్యంత కఠినమైన పరీక్షలలో యుపిఎస్‌సి ఒక్కటి. ఇందుకు అభ్యర్థులు అన్ని విధాలుగా సిద్ధం కావల్సి ఉంటుంది. ఇంతకు ముందటి పరీక్షలు, ఉపయుక్త సమాచారం ఈ పోర్టల్‌లో పొందుపర్చారని , ఇది సివిల్స్ అభ్యర్థులకు మంచి మేలుచేస్తుందని ప్రధాని తెలిపారు. ప్రతి ఏఠా ఎందరో ఈ పరీక్షలు రాస్తారు. పోటీ పరీక్షలకు దిగే వారు ఎంతో సమయం, డబ్బు వెచ్చించి ఈ పరీక్షలు రాస్తారు. కొందరు అతి తక్కువ మార్కుల తేడాతో అవకాశం పోగొట్టుకుంటారు. ఇటువంటి వారి కోసం ఈ ప్రతిభా సేతు పోర్టల్ ఆరంభించారని ప్రధాని వివరించారు. సివిల్స్‌లో అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించి , ఏదో ఒక స్థాయిలో మెరిట్ లిస్టులో చోటు దక్కని వారి పేర్లను కూడా ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు.ఈ పోర్టల్ పరిశీలించుకుని ప్రైవేటు సంస్థలు మెరిట్ లిస్టులో లేని వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.

స్వదేశీ వెల్లువెత్తాలి.. పండుగలా
దేశానికి పర్వదినాల కాలం. మనమంసివితా ఈ శుభ సందర్భంలో స్వదేశీ ఉత్పత్తుల వాడకం బాట పడుదాం. ఇందుకు గర్విద్దాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక వరుసగా మనకు పండుగలు సాంప్రదాయక ఉత్సవాలకు అద్దం పడుతూ ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం దేశీయ దుస్తులు ధరించాలి. ఇక్కడ తయారు అయ్యే అనేక రకాల సరుకులను విరివిగా ప్రచారం చేయాలని, ఇది జాతీయ ఉద్యమమే అవుతుందని తెలిపారు. మన ముందు ఎంచుకున్న సుసంపన్న భారత్ లక్ష ఛేదనకు కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉంది. మనం స్థానికత నినాదం వెల్లువెత్తేలా ప్రతిన వహించాల్సి ఉందని ప్రధాని చెప్పారు. మన కాళ్ల మీద మనం నిలబడటమే కాదు, ముందుకు పరుగులు తీసే విధంగా ఆత్మనిర్భరతను చాటుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అమెరికా నుంచి మన సరుకులపై అత్యధిక రీతిలో 50 శాతం సుంకాల విధింపు వల్ల తలెత్తిన పరిస్థితి నుంచి గట్టెక్కడానికి స్వదేశీ ప్రధాన అంశం అవుతుందని ఆయన చెప్పకనే చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ఎల్లెడలా ఖ్యాతి దక్కుతోంది. రామాయణం, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ ఆదరణ, అక్కున చేర్చుకునే తత్వం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నలుమూలలా విస్తరిస్తోంది. కెనడాలోని మిసిస్‌సౌగాలో ఆగస్టులోనే 51 అడుగుల ఆజానుబాహు రామ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అందరిని ఆకట్టుకొంటోందని ప్రధాని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలతో కాల పరీక్షలే
ఈ వర్షాకాలం దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాకాల ప్రకృతి వైపరీత్యాలు బాధాకరం అయ్యాయని ప్రధాని చెప్పారు. ఉత్తరాఖండ్ ఇతర చోట్ల జలవిలయాన్ని ప్రస్తావించారు. ఈ నష్టదాయక పరిణామాలు మనకు కాలం మిగిల్చే సవాళ్లు పరీక్షలు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందరో నిర్వాసితులు అయ్యారు. రహదారులు దెబ్బతిన్నాయి. ఆనకట్టలు ధ్వంసం అయ్యాయి. జరిగిన ఆస్తినష్టం, ప్రాణనష్టం బాధాకరం అన్నారు. ప్రకృతి వైపరీత్యం నడుమనే జమ్మూ కశ్మీర్‌లో రెండు ప్రధాన ఘట్టాలు జరిగాయి. ఇది ఎక్కువ మందికి దృష్టికి రాకపోవచ్చు. అక్కడి పుల్వామాలో తొలిసారి డే నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. శ్రీనగర్‌లోని దాల్‌లేక్‌లో కేలో ఇండియా వాటర్ స్పోర్ట్ ఉత్సవాలు జరిగిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువకుడు మెహిసిన్ అలీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆయనకు క్రీడలలో బంగారు పతకం వచ్చింది. ఇటువంటి వారు తమ సమర్థతతో దేశానికి ఈ ప్రాంతం తరఫున ప్రతిష్ట తెస్తారని చెప్పారు.

హైదరాబాద్ విమోచన దినం ప్రస్తావన
తమ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఈసారి కొద్ది సేపు ఉక్కు మనిషి , దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ మాటలతో కూడిన ఆడియో విన్పించారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుగుతుంది. పటేల్ తమ ఆపరేషన్ పోలో సందర్భంగా వెలువరించిన ప్రసంగం ఆడియో ద్వారా ప్రధాని మోడీ పటేల్‌ను , పలువురు అమరవీరులను స్మరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News