- Advertisement -
ఇష్టం ముదిరి
పట్టపగలే కల జోలెతో
అర్థరాత్రిని తలుపు కొట్టింది
తలుపు తెరిచి
వేసిన భిక్షకి
రుణం తీర్చలేకపోయింది జ్ఞాపకం
ఎడారిగా మారిన
నిద్ర సంద్రంపై
ఈత రాని కునుకు
ఏకాంతాన్ని ఢీ కొట్టి
పడక చెదిరి
మదిగదంతా పడమటి గాలులే
తొలి లేఖలోని
చిట్లిన ముఖాలతో ఉన్న వాక్యాలు
బతుకు పొలిమేరలో పిచ్చి గీతలతో కలసి
పాత ఇష్టాలకు కసిగా
తిరిగి బట్వాడా కావాలని
చిరునామా కోసం గాలిస్తున్నాయి
Also Read : బీసీల రిజర్వేషన్లకు ఆమోదం
- చందలూరి నారాయణరావు
- Advertisement -