Monday, September 1, 2025

ఆర్‌జివి కొత్త సినిమా.. పోస్టర్‌ చూస్తేనే వణుకొచ్చేస్తుంది..

- Advertisement -
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఒకప్పుడు ట్రెండ్ సృష్టించిన డైరెక్టర్. శివ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన వర్మ.. ఆ తర్వాత తెలుగు, హిందీల్లో పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులను అలరించారు. ‘రక్త చరిత్ర’ సినిమాతో గ్రాండ్ హిట్‌ని అందుకున్న ఆయన ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌ఫుల్ సినిమాలను రూపొందించలేదు. తాజాగా వర్మ తన ఫేవరేట్ జోన్ అయిన హారర్ జానర్‌లో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పోలీస్‌స్టేషన్‌ మే భూత్’ అనే సినిమాతో వర్మ త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నారు.

ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి, జెనిలియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో మనోజ్, ఓ బొమ్మని పట్టుకొని భయంకరంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటో చూస్తేనే వణుకు పుట్టేలా ఉంది. ‘‘ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ని ఓ పోలీస్ అధికారి ఎన్‌కౌంటర్ చేస్తే.. అతను దెయ్యంగా మారి మళ్లి పోలీసులను భయపెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కి వస్తాడు.. అదే సినిమా టైటిల్ ‘పోలీస్‌స్టేషన్‌ మే భూత్’. మరణించిన వాళ్లను అరెస్ట్ చేయలేరు’’ అంటూ ఈ సినిమా పోస్టర్‌కి వర్మ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు ఆర్‌జివికి (Ram Gopal Varma) ఈ సినిమాతో మంచి హిట్ రావాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : కర్ణాటక సీఎంని కలిసిన గ్లోబల్ స్టార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News