ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు యూట్యూబ్‌లో ఛానెళ్లు పెట్టి.. వీడియోలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇందుకు క్రికెటర్లు కూడా అతీతం కాదు. పలువురు క్రికెటర్లు యూట్యూబ్ ఛానెళ్లు క్రియేట్ చేసుకొని.. క్రికెట్ గురించి విశ్లేషిస్తున్నారు. మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు యూట్యూబ్‌లో చాలా యాక్టివ్ ఉంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) కూడా చేరాడు. అయితే కుల్దీప్ మాత్రం తన ఛానెల్‌లో క్రికెట్ గురించి కాకుండా ఫుట్ బాల్ గురించి విశ్లేషిస్తున్నాడు.
కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన కుల్దీప్ ఇప్పటివరకూ రెండు వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ‘క్రికెట్ ఈజ్ మై గేమ్, వైల్ ఫుట్‌బాల్ ఈ మై ఫేవరేట్’ అని తన డిస్క్రిప్షన్‌లో రాసుకొచ్చాడు. ‘మై ఫస్ట్ ఫుట్ బాల్ రివ్యూ’ అంటూ 4.07 నిమిషాలతో తొలి వీడియోని అప్‌లోడ్ చేశాడు. తాజాగా ‘ఫుల్ టూ ఫుట్ బాల్’ అంటూ 9.35 నిమిషాల వీడియోని రిలీజ్ చేశాడు కుల్దీప్. ప్రస్తుతానికి అతడి ఛానల్‌కు 6 వేలకుపైగా సబ్స్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కి కుల్దీప్ (Kuldeep Yadav) ఎంపికైనా.. ఒక మ్యాచ్‌లో కూడా ఆడలేదు. త్వరలో జరగనున్న ఆసియాకప్ కోసం ప్రకటించిన జట్టుకు కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. మరి ఆసియాకప్‌లో కుల్దీప్ ఎలా రాణిస్తాడో చూడాలి.
Also Read : మహిళా క్రికెట్‌పై కాసుల వర్షం