Thursday, September 4, 2025

తగ్గనున్న నిత్యావసరాల ధరలు

- Advertisement -
- Advertisement -

పాలు, పనీర్, హేర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, టూత్ బ్రష్లు, సబ్బులు, షాంపూలపై జీఎస్టీ తగ్గింపు వల్ల వాటి ధరలు తగ్గుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18 శాతం నుండి 5 శాతం, కొన్నింటిపై 12 శాతం నుండి 5 శాతం, మరికొన్ని జీరో శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమేదీ సాధించలేక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా మోడీ తల్లిని దూషించేలా చేసిన వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీకి జీఎస్టీ తగ్గించినందుకు, పండుగ సమయంలో ఊరట ఇచ్చినందుకు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలభిషేకం చేపట్టాలని నిర్ణయించిందని అన్నారు. మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పాలాభిషేకం నిర్వహించాలని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని భాగ్యనగరం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరు రానున్నారని తెలిపారు. మొజంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానానికి అనుగుణంగా శోభాయాత్రలో పాల్గొని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News