కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం. దొంతరబోయిన కామేశ్వరరావు (42) మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రైవేట్ కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతూ మనోవేదనకు గురవుతున్నట్టు సమాచారం . కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై నేడు ఉదయం ఎర్రగడ్డలోని స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కాలంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో దంపతులిద్దరికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బండారి కిషోర్ తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -