Thursday, September 11, 2025

గ్రూప్1 తీర్పుపై అప్ప్పీల్‌కు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం టిజిపిఎస్‌సి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు తీర్పుపై ఏవిధంగా ముందు కు వెళ్లాలో న్యాయ నిపుణులతో టిజిపిఎస్‌సి కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం గ్రూప్ 1 అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించనట్లు సమాచారం. న్యాయపరమయిన అంశాలు చర్చించాక తు ది నిర్ణయ తీసుకోనుందని తెలుస్తోంది. ఈ క్ర మంలో తీర్పు వెలువడిన
అనంతరం టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు టిజిపిఎస్‌సి సిద్దమవుతున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయంలో అనుకూలమయిన తీర్పుకోసం అవసరమయితే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించేందుకు టిజిపిఎస్‌సి సిద్దమయినట్లు తెలిసింది. గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ జనరల్ ర్యాంకుల జాబితాను రద్దు చేస్తూ తిరిగి పునః మూల్యాంకనం నిర్వహించాలని, అది కుదరకపోతే పరీక్షను తిరిగి నిర్వహించాలని, దీనికి ఎనిమిది నెలల గడువు ఇస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం విధితమే. ఈ క్రమంలో టిజిపిఎస్‌సి ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News